భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!
- 'మా ఇంటి బంగారం' సినిమాతో వస్తున్న సమంత
- ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఊహించని ఘటన
- స్టేజ్‌పైకి దూసుకొచ్చి సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని
- అభిమానితో ఓపికగా సెల్ఫీ దిగి తిరిగి పంపించిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని హఠాత్తుగా వేదికపైకి వచ్చి భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిన్న జరిగిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హాజరైంది. వేదికపై సమంత భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు మాట్లాడుతుండగా.. ఓ అభిమాని అకస్మాత్తుగా స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. నేరుగా సమంత వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని, చేతిలోని పువ్వులతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ అనూహ్య పరిణామానికి రాజ్ నిడిమోరు, యాంకర్ శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి షాక్‌కు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ అభిమానిని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ అభిమాని ఒక్క సెల్ఫీ కావాలని కోరడంతో సమంత ఎంతో ఓపికగా స్పందించారు. అతడిని నిరాశపరచకుండా చిరునవ్వుతో సెల్ఫీకి ఫోజులిచ్చారు. అభిమాని పట్ల సమంత చూపిన తీరుకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.